- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్ లుక్‌లో శర్వానంద్ సంచలనం.. సంపత్ నంది దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
శర్వానంద్-సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. 1960ల నాటి యథార్థ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 28, 2026న విడుదల కానుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Hero Sharwanand) ఫ్యామిలీ, కామెడీ చిత్రాలకు ఎంతో పేరుగాంచిన. కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా.. మాస్ లుక్ లో తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 38వ చిత్రంలో నటిస్తున్నారు. 'భోగి' (BHOGI) అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా (Periodic action drama)ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Director Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
'ఎ బ్లడ్ ఫెస్ట్ ('A Blood Fest') అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం కోసం శర్వానంద్ 'గంగ' అనే పాత్రలో పూర్తి మాస్, రగ్గడ్ లుక్‌లోకి మారిపోయారు. 1960వ దశకంలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల (True events) ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ చిత్రం ఆగస్టు 28, 2026న రక్షాబంధన్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తుండగా, రోహిత్ పాఠక్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా, సౌందర్ రాజన్, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షిస్తుండగా, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా శర్వానంద్‌ను సరికొత్త మాస్ యాక్షన్ హీరోగా నిలబెడుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.






