- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోగి నుండి శర్వానంద్ మాస్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
భోగి నుండి శర్వానంద్ ఫస్ట్ లుక్ విడుదల.. ఆగస్టు 28, 2026న ఈ సినిమా విడుదల కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వారిలో శర్వానంద్ ఒకరు. ఈయన హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం విభిన్న కథాంశాలతో రూపొందే చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోగి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే ఈ చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో శర్వానంద్ ఒక చేతిలో కత్తిని పట్టుకొని, గుబురు మీసంతో, పెద్ద కళ్ళతో చూస్తున్నాడు.
ఈ పోస్టర్‌ను బట్టి చూస్తుంటే ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. ఇప్పటివరకు శర్వానంద్ తన కెరీర్లో ఈ స్థాయి మాస్ లుక్లో ఎప్పుడూ కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆగస్టు 28, 2026న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ఈ చిత్రంలో హీరోయిన్లుగా కనిపించనుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. కె.కె. రాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నాడు.






