- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీటింగ్ రద్దు.. పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ భేటీ
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామితో టీవీకే నేత ఆనంద్ భేటీ కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ రద్దయ్యింది. 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) భారీ విజయం సాధించినప్పటికి.. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే నేత విజయ్ ప్రయత్నాలు ప్రారంభించగా కాంగ్రెస్ సహా ఇతర చిన్న పార్టీల మద్దతు కోరారు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ కోసం ప్రయత్నిస్తున్న టీవీకే (TVK) వ్యూహకర్త ఎన్. ఆనంద్ (N. Anand), అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆనంద్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ భేటీతో తమిళనాట 'విజయ్-పళనిస్వామి' పొత్తు ('Vijay-Palaniswamy' alliance) పొడవబోతుందా? అనే చర్చకు తెరలేచింది.
మరోవైపు అన్నాడీఎంకేలో మునుపెన్నడూ లేని విధంగా చీలిక ఛాయలు కనిపిస్తున్నాయి. ఈరోజు జరగాల్సిన ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం అకస్మాత్తుగా రద్దు కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకేకు చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. డీఎంకేను అడ్డుకోవాలంటే టీవీకేతో చేతులు కలపడమే మార్గమని వారు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో, రేపు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి తమిళ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.






