- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. కానీ కొన్ని షరతులు
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. పెరియార్, అంబేద్కర్ ఆదర్శాలతో పాటు మతతత్వ శక్తులను దూరంగా ఉంచాలనే షరతుపై విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు లేఖ విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో రాజకీయం గంట గంటకు మారుతోంది. ఈ ఫలితాల్లో 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా మెజార్టీ మార్కుకు అవసరం అయిన సంఖ్య కోసం వివిధ పార్టీలతో టీవీకే నేతలు చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు కొరగా.. ఈ రోజు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డీఎంకేకు షాక్ ఇచ్చి.. టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు. అలాగే ఈ మద్దుతుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని కండిషన్లు పెట్టింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతు ఇస్తామని తెలుపుతు లేఖను విడుదల చేసింది.
అందులో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ మద్దతును అందించాలని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు సి. విజయ్ భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి)ని లాంఛనంగా అభ్యర్థించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు తమ పూర్తి మద్దతును అందించాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ శాసనసభ పక్షం (సిఎల్‌పి) నిర్ణయించాయి. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని ఏ మతతత్వ శక్తులనైనా ఈ కూటమికి టీవీకే దూరంగా ఉంచాలనే షరతుపై మా మద్దతు ఉంటుంది. రాబోయే సంవత్సరాలు, దశాబ్దాలలో తండై పెరియార్ సామాజిక న్యాయ ఆదర్శాలకు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ ఆదర్శాలకు గట్టి నిబద్ధతతో, పెరుంతలైవర్ కామరాజ్ స్వర్ణయుగాన్ని తమిళనాడుకు తిరిగి తీసుకురావడానికి టీవీకే, తమిళనాడు కాంగ్రెస్ మధ్య ఈ కూటమి కృషి చేస్తుంది అని కాంగ్రెస్ లేఖలో రాసుకొచ్చింది.






