- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిప్తి, షాహిద్ కపూర్ చేసిన పనికి సీనియర్ నటుడు ఆగ్రహం.. అసలేం జరిగిందంటే?
సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri), షాహిద్ కపూర్ (Shahid Kapoor)జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ రోమియో’.

దిశ, సినిమా: సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri), షాహిద్ కపూర్ (Shahid Kapoor)జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓ రోమియో’. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమానికి హీరో హీరోయిన్లు షాహిద్ కపూర్, త్రిప్తి డిమ్రి గంటన్నర ఆలస్యంగా రావడంతో సీనియర్ నటుడు నానా పటేకర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరో సినిమా పోస్టర్ లాంచ్ కారణంగా వీరు లేట్‌గా రావడంతో, వేదికపై దాదాపు 90 నిమిషాల పాటు వేచి చూసిన నానా పటేకర్(Nana Patekar) అసహనం వ్యక్తం చేస్తూ ట్రైలర్ రిలీజ్ కాకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ స్పందిస్తూ.. ‘నానా ఉంటే బాగుండేది, కానీ గంటపాటు వేచి ఉండాల్సి రావడంతో ఆయన వెళ్ళిపోయారు, అది ఆయన స్వభావం’’ అని వ్యాఖ్యానించారు. అయితే నానా పటేకర్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. సీనియర్ నటుల సమయాన్ని గౌరవించకపోవడం తప్పు అంటూ షాహిద్, త్రిప్తిలను ట్రోల్ చేస్తున్నారు. సాజిత్ నడియవాలా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో తమన్నా, దిశా పటానీ, విక్రాంత్ మస్సే వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సమయంలో జరిగిన ఈ వివాదం సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చేసింది.
Read More..






