కాసేపట్లో ఎస్ఈసీ ప్రెస్‌మీట్.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-27 10:41:10  IST  )

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగనుంది.

కాసేపట్లో ఎస్ఈసీ ప్రెస్‌మీట్.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే చాన్స్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మధ్యాహ్నం 3.45 గంటలకు హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్‌లో గల డీటీసీపీ (DTCP) భవనంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు 2వ సాధారణ ఎన్నికలు - 2026పై విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మీడియా ప్రతినిధులకు అధికారికంగా ఇప్పటికే సమాచారం అందింది. ఎస్‌ఈసీ రాణి కుముదిని మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు ఈ సమావేశంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (Model Code of Conduct) అమల్లోకి రానుంది.

READ MORE ....

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Next Story