- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 166 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ ఎస్ఈసీ రాణి కుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే దఫాలో ఒకే రోజున ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నామని, రీ పోలింగ్ ఎక్కడైనా అవసరం ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహించి మిగతా అన్ని స్థానాలతోపాటే ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపత్యంలో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
నోటిఫికేషన్ షెడ్యూల్:
నోటిఫికేషన్ విడుదల: 28-01-2026
నామినేషన్ల స్వీకరణ: 28.-01-2026
నామినేషన్ల దాఖలుకు చివరి తేది:30-01-2026
నామినేషన్ల పరిశీలన:31-01-2026
నామినేషన్లపై అభ్యంతరాలు:01-02-2026
అభ్యంతరాలపై పరిష్కారం:02-02-2026
నామినేషన్ల ఉపసంహరణ గడువు:03.02-2026
బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల:03-02-2026
పోలింగ్:11-02-2026
రీపోలింగ్-12-02-2026
కౌంటింగ్:13-02-2026 (ఉదయం 8 గంటల నుండి)






