- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tollywood: పదిరోజులు, ఐదు సినిమాలు.. వందలకోట్ల కలెక్షన్లు!
సంక్రాంతి పండుగ తెలుగులో విడులైన అన్ని సినిమాలకు బాగా కలిసివచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ తెలుగులో విడులైన అన్ని సినిమాలకు బాగా కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన రాజాసాబ్ మినహా దాదాపు అన్ని సినిమాలు లాభాల బాట పట్టినట్లు సమాచారం. మొత్తంగా ఈ సంక్రాంతికి తెలుగులో ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ - మారుతీ కాంబినేషన్‌లో వచ్చిన రాజాసాబ్, రవితేజ - కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ - రామ్ అబ్బరాజు నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి - డైరెక్టర్ మారి కాంబినేషన్‌లో వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పండుగ సమయం కావడంతో కుటుంబాలకు కుటుంబాలు థియేటర్లకు తరలివెళ్లాయి. దీంతో దాదాపు అన్ని సినిమాలకు చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చిన్నట్లు ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ ఐదు సినిమాలకు కలిపి పది రోజుల్లో దాదాపు రూ.800 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు సినిమా మళ్లీ పుంజుకుంటోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.






