మ‌న శంక‌ర్ వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ

by velandi.Saikiran |   (  Updated:2026-01-20 10:04:28  IST  )

మ‌న శంక‌ర్ వ‌ర ప్ర‌సాద్ గారు స్పెషల్ షో చూసిన, అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు.

మ‌న శంక‌ర్ వ‌ర ప్ర‌సాద్ గారు సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా స్పెషల్ షో చూసిన, అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు బన్నీ. మన శంకర వరప్రసాద్ గారు రియల్ సంక్రాంతిని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి... వింటేజ్ యాక్టింగ్ తో ఇరగదీసినట్లు ప్రశంసించారు.

వెంకీ గౌడ పాత్రలో వెంకీ మామ ఇరగదీసాడని అల్లు అర్జున్ ( Allu Arjun ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాకు అందమైన లుక్ తీసుకువచ్చింది నయనతార గారు అంటూ పొగిడారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్ తనకు బాగా నచ్చిందన్నారు. ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ సినిమా చేసిన అనిల్ రావిపూడికి ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలిపారు అల్లు అర్జున్.

రూ.300 కోట్ల క్లబ్ లో చిరంజీవి సినిమా !

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara Vara Prasad Garu ) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి.. రూ.300 కోట్ల వరకు వసూళ్లు రాబడినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మరో వారం రోజుల పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కురిపించబోతుందని అంటున్నారు విశ్లేషకులు.

Read More... Tollywood: పదిరోజులు, ఐదు సినిమాలు.. వందలకోట్ల కలెక్షన్లు!

Next Story