- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాదంలో చిక్కుకున్న సాయిపల్లవి సినిమా .. అదృష్టం కలిసొచ్చేనా?
నేచురల్ బ్యూటీగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి(Sai Pallavi), గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి(Sai Pallavi), గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస విజయాలతో స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఆమె, సంప్రదాయ లుక్స్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ‘లవ్ స్టోరీ’, ‘అమరన్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో పాటు, గతేడాది వచ్చిన ‘తండేల్’ సినిమాతో మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించింది. రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి సాయి పల్లవిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక త్వరలో ‘రామాయణ’ సినిమాలో కీలక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే.. సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఏక్ దిన్’(ek din) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ హిందీ చిత్రంతో రాబోతుంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్(Junaid Khan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. ఐస్‌క్రీమ్‌తో కనిపించిన సాయి పల్లవి, జునైద్ జంట లుక్ అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, అదే సమయంలో వివాదానికి దారితీసింది. 2016లో విడుదలైన థాయ్ రొమాంటిక్ డ్రామా ‘వన్ డే’కు ఈ పోస్టర్ చాలా దగ్గరగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
టైటిల్ నుంచి పోస్టర్ వరకూ అన్నీ సేమ్‌గా ఉన్నాయని, ఇది రిమేక్? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా, గతంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన లాల్ సింగ్ చద్దా, లవ్ యప్పా, సితారే జమీన్ పర్ సినిమాల ఫలితాలను ప్రస్తావిస్తూ.. ‘ఏక్ దిన్’ కూడా అదే బాటలో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ పోస్టులు వైరల్‌గా మారడంతో, సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం మొదలవకముందే అనుకోని అడ్డంకులు ఎదుర్కొంటోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక అదృష్టం కలిసొచ్చి వివాదం సర్దుమనిగి సినిమా హిట్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి
Read More..






