- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి అయిపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.. కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)చెల్లెలు నుపుర్ సనన్(Nupur Sanon) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)చెల్లెలు నుపుర్ సనన్(Nupur Sanon) ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్(Stebin Ben)ను నుపుర్ తన జీవిత భాగస్వామిగా ఎంచుకోగా… ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో తన చెల్లిని తలుచుకుని కృతి సనన్ సోషల్ మీడియాలోఎమోషనల్ పోస్ట్ చేసింది. నుపుర్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆమె లేనిదే ఇంట్లో ఖాళీగా, వెలితిగా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. ‘‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు నిన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి.. నేడు నీ పెళ్లిలో నీ తలపై పూల చాదర్ పట్టుకుని నిన్ను వధువుగా చూడడం వరకు కాలం ఎంత వేగంగా పరుగెత్తిందో అర్థమైంది.
నువ్వు నిన్ను ప్రాణంలా ప్రేమించే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నా గుండె గర్వంతో నిండిపోయింది. నా చిన్న తల్లికి పెళ్లయిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను’’ అంటూ కృతి తన మనసులోని భావాలను వ్యక్తం చేసింది. అలాగే, చెల్లెలి భర్త స్టెబిర్ బెన్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘స్టెబు, నువ్వు ఇక మా కుటుంబ సభ్యుడివే. నీ రూపంలో నాకు ఒక తమ్ముడు, మంచి స్నేహితుడు దొరికాడు. మీరు ఇద్దరూ పెళ్లి ప్రమాణాలు చేసుకుంటున్నప్పుడు అది నా జీవితంలోనే అత్యంత ఎమోషనల్ మూమెంట్’’ అని పేర్కొంది. చెల్లి నుపుర్ గురించి మాట్లాడుతూ..‘‘నువ్వు దగ్గర్లోనే ఉంటావని నాకు తెలుసు. కానీ నీ నవ్వులు లేని ఇల్లు ఇప్పుడు బోసిపోయినట్టుగా అనిపిస్తోంది.
నువ్వు ఇప్పుడు రెండు ఇళ్లలో ఆనందాన్ని పంచబోతున్నావు. లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్’’ అంటూ కృతి ఎమోషనల్‌గా అయింది. ఇక దీనికి నుపుర్ ‘‘కృత్సూ… నువ్వే నా ప్రపంచం, నా లైఫ్ లైన్. ఆ పూల చాదర్ చాలా బరువుగా ఉందని అందరూ అన్నారు. కానీ, దాన్ని పట్టుకోవాల్సింది నువ్వేనని నాకు తెలుసు. సోదరిగా, సోదరుడిగా, నా ధైర్యంగా, నా చిన్న తల్లిగా నువ్వు నాకు చేసిన ప్రతిదీ నా మనసులో పదిలంగా ఉంది. లవ్ యూ అక్కా’’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అక్కాచెల్లెలి బంధాన్ని గుర్తు చేస్తున్నాయి.
Read More..
లంగా ఓణీలో పవన్ కళ్యాణ్ బ్యూటీ.. ఆ కళ్లేంటి బాబోయ్ అలా ఉన్నాయంటూ కామెంట్స్






