డీసీఎం‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 27 మందికి పైగా గాయాలు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-14 04:57:53  IST  )

రాష్ట్రంలో పండగవేళ తీవ్ర విషాదం నెలకొంది.

డీసీఎం‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 27 మందికి పైగా గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్/జడ్చర్ల: పండుగ వేళ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న డీసీఎం లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు వెనుక నుంచి లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై డ్రైవర్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోగా.. 27 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పండుగ వేళ కావడంతో బస్సులో మొత్తం 53 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ అజాగ్రత్తతో పాటు అతివేగమే కారణమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

READ MORE ....

వడ్డీల ఉరితాళ్ళకు తల్లి కొడుకుల బలి

Next Story