వడ్డీల ఉరితాళ్ళకు తల్లి కొడుకుల బలి

by Thanuru Gopichand |   (  Updated:2026-01-14 05:01:59  IST  )

వేటపాలెంలో పండగ వేళ విషాదం.

వడ్డీల ఉరితాళ్ళకు తల్లి కొడుకుల బలి
X

దిశ ప్రతినిధి, బాపట్ల: పండుగ పూట ఓ ఇంట పెను విషాదం నెలకొంది. తల్లి కొడుకు ఆత్మహత్యకు యత్నించడంతో ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఈ హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా పరిధిలో వేటపాలెం మండలంలో ఉన్న శ్రీనివాసనగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సుజాత (55) కుటుంబంతో కలిసి చీరాల కొట్ల బజారులో నివసిస్తున్నారు. ఆమెకు కొడుకు సాయి (24) ఉన్నారు. కొంత కాలం క్రితం సుజాత భర్త అనారోగ్యంతో మరణించారు. దీంతో చీరాల రైల్వే స్టేషన్ వద్ద కొడుకుతో కలిసి టిఫిన్ బండి నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపార నిర్వహణలో భాగంగా అప్పులు పెరిగిపోయాయి. బాకీలు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు తల్లి కొడుకుపై ఒత్తిడి పెంచారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురైన సుజాత, ఆమె కుమారుడు సాయి ఆత్మహత్యకు యత్నించారు. శరీరంపై చమురు వంటి ద్రవాన్ని చల్లుకొని నిప్పంటించుకున్నారు. దీంతో తల్లి, కొడుకు శరీర భాగాలు మంటలకు కాలిపోయాయి. గమనించి స్థానికులు వెంటనే వారి వద్దకు చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం విషమ పరిస్థితుల్లో తల్లి కొడుకును ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని.. బాధితులిద్దరికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

READ MORE ....

డీసీఎం‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 27 మందికి పైగా గాయాలు

Next Story