- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.1600 కోట్ల మద్యం అక్రమాలు.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, సీఎం జోసెఫ్ విజయ్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, సీఎం జోసెఫ్ విజయ్ అవినీతిపై ఉక్కుపాదం మోపారు. గత ఐదేళ్ల డీఎంకే పాలనలో ప్రభుత్వ మద్యం విక్రయాల సంస్థ 'టాస్మాక్'(TASMAC) హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్ ద్వారా దాదాపు రూ. 1,600 కోట్ల మేర భారీ మద్యం అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఆయన తీవ్ర చర్యలకు ఆదేశించారు. ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరకుండా 'పార్టీ ఫండ్' పేరుతో అనధికారికంగా మళ్లించబడ్డాయని విచారణలో వెల్లడైంది. ఈ స్కామ్‌కు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ప్రతి నెల సుమారు రూ. 102 కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. లిక్కర్ కేసుకు రూ.90, బీర్ కేసుకు రూ.40, వైన్ కేసుకు రూ.20 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ తన తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ వ్యవహారంపై అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
టాస్మాక్‌లో సాగుతున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థను తక్షణం రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరాలని, టాస్మాక్ హోల్‌సేల్, రిటైల్ నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి, ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పదవిలోకి వచ్చిన తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే సీఎం విజయ్ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






