- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‍లో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
by Prasad Jukanti |
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనంతో పాటు ఫ్లైఓవర్లు, ఆస్పత్రి నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్తాపన చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‍లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మొత్తం రూ. 1,474 కోట్ల అ భివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏవోసీ సెంటర్ చుట్టూ రూ.960 కోట్లతో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, టీకేఆర్ కాలేజ్ జంక్షన్ నుంచి మందా మల్లమ్మ జంక్షన్ వరకు రూ. 416 కోట్లతో ఆరు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి భూమి పూజ, ఉప్పల్‍లో వంద పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు చెల్లించేందు కోసం రూపొందించిన క్యూర్-1 మొబైల్ యాప్‍ను సైతం సీఎం ప్రారంభించారు.
Next Story






