బీజేపీ నేత ప్రతాప రామకృష్ణకు చేదు అనుభవం

by Ratna Kumari |

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు జన్మదిన వేడుకలకు ఒక్కరోజు ముందే చేదు అనుభవం ఎదురైంది.

బీజేపీ నేత ప్రతాప రామకృష్ణకు చేదు అనుభవం
X

దిశ, వేములవాడ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు జన్మదిన వేడుకలకు ఒక్కరోజు ముందే చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా బీజేపీ శ్రేణులు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గురువారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగించినట్లు మున్సిపల్ సిబ్బంది తెలిపారు. జన్మదిన వేడుకలు జరగకముందే, అదీ వేడుకలకు ఒక్కరోజు ముందు ఫ్లెక్సీలను తొలగించడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతాప రామకృష్ణ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి పరిణామం చోటుచేసుకోలేదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఆయన ఎలా స్పందిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story