- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జన నాయగన్’ రిలీజ్..థియేటర్ లో నటి త్రిష సందడి
‘జన నాయగన్’ రిలీజ్ కాగా థియేటర్ కు వెళ్లి నటి త్రిష సందడి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జయ నాయగన్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. మొన్నటి సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా.. అనేక రకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ కు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సినిమా రిలీజ్ అయి.. సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాను చూసేందుకు హీరోయిన్ త్రిష థియేటర్ కు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చెన్నైలోని రోహిణి థియేటర్ కు వెళ్లిన ఆమె... మూవీని వీక్షించారు.
అయితే ఈ థియేటర్ కు ఆమె వెళ్లగానే అక్కడ ఉన్న అభిమానులు రచ్చ చేశారు. త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేసి సందడి చేశారు. సినిమా చూసిన తర్వాత ఎలాంటి కామెంట్ చేయకుండా... కారెక్కి త్రిష వెళ్లిపోయారు. అయితే గత కొన్ని రోజులుగా సీఎం విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందని జోరుగా ప్రచారం తాగుతోంది. ఈ నేపథ్యంలోనే త్రిష ఎక్కడికి వెళ్ళినా తమిళనాడులో హడావిడి కనిపిస్తోంది. కాగా ఇప్పటికే త్రిష, విజయ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఆయన నటించిన గోట్ సినిమాలో కూడా స్పెషల్ రోల్ చేసి ఈ సందడి చేసింది. క్లిక్






