- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణ కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం కేసుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణ కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం కేసుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. దీంతో అప్పలరాజును పరామర్శించేందుకు మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. ఈ మేరకు ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై ధర్మాన కృష్ణదాస్‌తో పాటు వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లే తమ నేతలపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. తమ నేతలపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.






