అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి

by Ratna Kumari |

ప్రజా ప్రభుత్వంలో ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తెలిపారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి
X

దిశ, కేసముద్రం : ప్రజా ప్రభుత్వంలో ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ తెలిపారు. గురువారం కేసముద్రం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 44 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.44,05,104 విలువైన కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెల రెండు విడతల్లో సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేదా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని, అన్ని పథకాలు పూర్తిగా ఉచితంగానే అందజేయబడుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీత, జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ బండారి వెంకన్న, దాస్రూ నాయక్, మాజీ ఎంపీపీ సురేందర్, మండల నాయకులు, సర్పంచులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story