- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్లతో తహసీల్దార్ సూర్యప్రకాశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రేషన్ డీలర్లతో తహసీల్దార్ సూర్యప్రకాశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని ప్రతి రేషన్ కార్డు దారునికి వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయించడం సంబంధిత రేషన్ డీలర్ల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
మండలంలో మొత్తం 35,004 యూనిట్లు ఉండగా, ఇప్పటి వరకు 28,865 మంది ఈ-కేవైసీ పూర్తి చేశారని, ఇంకా 6,139 మంది పెండింగ్‌లో ఉన్నారని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా పెండింగ్‌లో ఉన్న వారందరి ఈ-కేవైసీని పూర్తి చేయాలని రేషన్ డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులను వ్యక్తిగతంగా సంప్రదించి ఈ-కేవైసీ చేయించాలని సూచించారు. ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి రేషన్ పంపిణీ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రతి రేషన్ కార్డు దారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని తహసీల్దార్ సూర్యప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.






