రైతులు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి పండించాలి

by Taduka Kalyani |

వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వలన ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేదని ఫనిగిరి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి జి శ్రీను తెలియజేశారు.

రైతులు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి పండించాలి
X

దిశ,నాగారం: వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వలన ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేదని ఫనిగిరి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి జి శ్రీను తెలియజేశారు. గురువారం రోజున ఫనిగిరి గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటుచేసిన రైతుల సమీక్షలో వ్యవసాయ విస్తరణాధికారి జి.శ్రీను మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల వలన ఈసారి తగినంతగా వర్షాలు పడే అవకాశం లేదని, భూగర్భ జలాలు అడుగంటుతాయని కావున రైతు సోదరులు వరి పంటను తగ్గించి ఆరుతడి పంటలైన కందులు,జొన్నలు,పెసర్లు,ఉలవలు,బొబ్బర్లు, శనగలు,మినుములు సజ్జలు కూరగాయలు లాంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫణిగిరి గ్రామ ఉప సర్పంచ్ వల్లాల భాను ప్రకాష్,రైతు సోదరులు రాము, వీరాచారి, మైనర్, అల్లయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story