- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ బర్త్ డే.. దావత్ కావాలంటూ సీఎం రేవంత్ ఫన్నీ కామెంట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలకు సర్వం సిద్ధం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది..

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Former Minsiter Ktr) బర్త్ డే వేడుకల(Birth Day Celebrations)కు సర్వం సిద్ధం చేసిన సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. శుక్రవారం కేటీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ే దీంతో విషేస్ చెప్పేందుకు కుటుంబసభ్యులు, సన్నిహితులు, పార్టీ నేతలు, ప్రముఖులు సన్నద్ధమయ్యారు.
కేటీఆర్ బర్త్ డే వేడుకలపై సీఎం ఫన్నీ ట్వీట్
అయితే కేటీఆర్ బర్త్ డే వేడుకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanthreddy) ఫన్నీ ట్వీట్ చేశారు. దావత్ ఇస్తానంటే విష్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దావత్ ఇస్తే అందులో ఏం కలుపుతారోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ ధర్నాలపైనా ఆయన స్పందించారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. గత ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించామని రేవంత్ గుర్తు చేశారు. అక్రమ ఆస్తులను కూల్చివేస్తున్న హైడ్రా చర్యలపైనా ఆయన రియాక్ట్ అయ్యారు. హైడ్రా వల్ల కోట్ల విలువైన ఆస్తులను కాపాడాగలిగామని చెప్పారు.






