- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలు, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను నిరసిస్తూ జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు.

దిశ, గద్వాల : దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలు, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను నిరసిస్తూ రేపు జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణతో పాటు టీఆర్‌ఎస్‌వీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, యూఎస్‌ఎఫ్‌ఐ తదితర విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైనందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే నీట్ పరీక్షలను నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేయాలని కోరారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గద్వాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు, ప్రజాస్వామ్యవాదులు రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.






