- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ సర్పంచులపై అధిష్టానం సీరియస్..!
తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, తంగళ్ళపల్లి : తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తంగళ్ళపల్లి మండలంలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మండలంలోని కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పదుల సంఖ్యలో సర్పంచులు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారంతోపాటు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎంపీని కలవడం ఆ పార్టీలో ఒక్కసారిగా చిచ్చు పెట్టినట్లు అయింది. సర్పంచుల తీరుపై హై కమాండ్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మూకుమ్మడిగా కలిసిన సర్పంచ్ లు..
తాడూరు, దేశాయిపల్లె తోపాటు పలు గ్రామాల సర్పంచులు మూకుమ్మడిగా కేంద్ర మంత్రిని కలవడం పట్ల పార్టీలో ఒక్కసారిగా వర్గ విభేదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. కొందరు సర్పంచుల చర్యతో రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎటువైపు దారి తీస్తుందని ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది.. సర్పంచులు అభివృద్ధి కోసమో.. సమస్యల పరిష్కారం కోసమో.. కేంద్ర మంత్రిని కలిసినప్పటికీ ఇప్పుడు తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ల వ్యవహారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది.






