- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు పై విరిగిపడ్డ భారీ చెట్టు
by Batti.Sumithra |
సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం విరిగి కింద పడింది. స్థానిక అస్తబల్ (ఎఫ్‌ఆర్‌ఎస్)లోని ప్రహరీ గోడ కూలి, ఆనుకుని ఉన్న చెట్టు విరిగిపడడంతో ఒక కారు పాక్షికంగా ధ్వంసమైంది.

X
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రోడ్డుపై భారీ వృక్షం విరిగి కింద పడింది. స్థానిక అస్తబల్ (ఎఫ్‌ఆర్‌ఎస్)లోని ప్రహరీ గోడ కూలి, ఆనుకుని ఉన్న చెట్టు విరిగిపడడంతో ఒక కారు పాక్షికంగా ధ్వంసమైంది. అయితే చెట్టు విరిగి పడిన చోట కారు అప్పటి నుంచే నిలిపి ఉంది. అక్కడే కార్లను పార్క్ చేసి డ్రైవర్లు నిత్యం ఉంటుంటారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో వృక్షం కింద పడడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై అడ్డంగా పడిపోయిన వృక్షాన్ని తొలగించారు. దీంతో కొద్దిసేపు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Next Story






