అవును తప్పైంది.. ఢిల్లీ ఆందోళనలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

కాంగ్రెస్, వామపక్షాలు విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని, టీఎస్‌పీఎస్సీ లీకేజీలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు

అవును తప్పైంది..  ఢిల్లీ ఆందోళనలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్, వామపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొన్ని రోజులుగా ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం అన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఆందోళనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, విద్యార్థులను అడ్డుపెట్టుకుని దేశ వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి గుర్తుందా అని నిలదీశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు ఎన్ని సార్లు లీకయ్యాయో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ మాకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. నాడు మీరు మంత్రి కాదా అని నిలదీశారు. నీట్

విదేశాల్లో చెడ్డీలతో తిరిగే మమ్మల్నీ రాజీనామా అడుగుతారా?

కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు పేపర్ లీక్ అయ్యాయని అప్పుడు ఎంత మంది రాజీనామా చేశారో కాంగ్రెస్ చెప్పాలన్నారు. నాడు రాజీనామాలు చేయకుండా ఇప్పుడు రాజీనామాలు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‍కు, రాహుల్ గాంధీకి ఉందా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయో ముందు రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ కు రాజకీయాలే ముఖ్యం, విద్యార్థుల భవిష్యత్ కాదన్నారు. తమ రాజకీయ అస్థిత్వం కోసం కాంగ్రెస్ అరచకాలు సృష్టిస్తోందని దుయ్యబట్టారు. నీప్రతి మూడు నెలలకు ఓ సారి విదేశాలకు వెళ్లి చెడ్డీలపై తిరిగే రాహుల్ గాంధీ మమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతారా అని నిలదీశారు. తుక్డే గ్యాంగ్ లన్నీ జంతర్ మంతర్ లో చేరిపోయాయని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మా దేశంలో శాంతిభద్రతల సమస్యలు లేవన్నారు.

తప్పైంది..

నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం విషయంలో తప్పు జరిగిందని అందువల్ల రీ ఎగ్జామ్ నిర్వహించామన్నారు. విద్యార్థుల భవిష్యత్‍ను దృష్టిలో పెట్టుకుని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామన్నారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని, ఘటనకు బాధ్యులైన 17 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రెండోసారి అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని, పేపర్ లీక్ అంశంపై కేంద్రం సీరియస్ గా ఉందన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందన్నారు. దీనికి రాజీనామా ఒక్కటే పరిష్కారం కాదన్నారు.

Next Story