- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త జిల్లాలకు ఇంచార్జి మంత్రుల నియామకం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇన్ చార్జ్ మంత్రులను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఈ నియామకాలు చేపట్టింది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల(Districts)కు ఇన్ చార్జ్ మంత్రుల(In charge Ministers)ను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఈ నియామకాలు చేపట్టింది. జిల్లాల వారీగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలనూ మంత్రులకు అప్పగించింది. పొలవరం జిల్లా ఇంచార్జి మంత్రి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని నియమించింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం (R&R), జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది.
మంత్రి ఆనంకు బాధ్యతలు
ఇక మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఎంపిక చేసింది. మార్కాపురం ప్రాంత అభివృద్ధి, సాగు-తాగునీటి ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించింది. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని సూచించింది.






