- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రానికి ప్రధాని మోడీ రాక.. ఆరు జిల్లాల పెన్షన్‌దారులకు తీపికబురు
ఆగస్టు 1న ప్రధాని మోడీ భోగాపురం విమానాశ్రయం పర్యటనకు విచ్చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రభుత్వం కీలక సడలింపు ఇచ్చింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 1న ప్రధాని మోడీ(Pm Modi) భోగాపురం విమానాశ్రయం(Bhogapuram Airport) పర్యటనకు విచ్చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల(People of North Andhra)కు ప్రభుత్వం కీలక సడలింపు ఇచ్చింది. ఆరు జిల్లాల్లో నెలవారీ సామాజిక పింఛన్ల పంపిణీ(Pension distribution)ని ఒక రోజు ముందే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం పర్యటన సమయంలో రవాణా ఆంక్షలు, ఇతర భద్రతా ఏర్పాట్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, పింఛనుదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ ముందుజాగ్రత్త చర్య చేపట్టింది.
అధికారుల అలర్ట్..
దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జూలై 31నే పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి నిధుల విడుదలపై చర్చించారు. జూలై 31 నాటికే నగదును సిద్ధం చేసి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రతినిధుల ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.






