కాంగ్రెస్‌లో క్రమశిక్షణ చర్యలు

by Ratna Kumari |

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్‌లో క్రమశిక్షణ చర్యలు
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన నలుగురు కాంగ్రెస్ పార్టీ సభ్యులను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఒరుగంటి నరసింహులు, ఎలుక రాజు, సయ్యద్ నుజ్రతుల్లా హుస్సేనీ, గంగి స్వామి ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి వీరికి ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేయగా, వారు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలు, సిద్ధాంతాలు, కార్యక్రమాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సంగీతం శ్రీనివాస్ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణకు ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు.

Next Story