జంతర్ మంతర్ వద్ద నిరసనలు.. వారి పాస్‌పోర్టులు రద్దు ?

by Naga Rani Yarlagadda |

జంతర్ మంతర్ వద్ద బుధవారం (జులై 22) రాత్రి జరిగిన నిరసనల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

జంతర్ మంతర్ వద్ద నిరసనలు.. వారి పాస్‌పోర్టులు రద్దు ?
X

దిశ, వెబ్‌డెస్క్: జంతర్ మంతర్ వద్ద బుధవారం (జులై 22) రాత్రి జరిగిన నిరసనల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన ఆందోళనల్లో నేరుగా పాల్గొని హింసను సృష్టించిన వారి పాస్‌పోర్టులను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది.

పోలీసులపై దాడి.. ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలు

జంతర్ మంతర్ సమీపంలో విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ నంద్ కిషోర్ సింగ్ పై ఆందోళనకారులు లారీలు, రాళ్లు, పదునైన వస్తువులతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై గాయపడిన ఇన్‌స్పెక్టర్ నంద్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. "అక్కడ సుమారు 4,000 నుంచి 5,000 మంది గుమిగూడి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నేను వారిని విద్యార్థులని భావించి విధుల నిమిత్తం వెళ్తుండగా, యూనిఫారంలో ఉన్న నాపై ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఏదోలా అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నాను" అని తెలిపారు.

తీవ్ర దర్యాప్తు.. చట్టపరమైన చర్యలు

ఈ ఘర్షణల్లో పలువురు పోలీసు సిబ్బంది గాయపడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆందోళనకారుల వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసులపై దాడులకు తెగబడటం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాస్‌పోర్ట్‌ల రద్దుకు చర్యలు వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story