విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.. రాజ్యసభలో ఖర్గే డిమాండ్

by Ajay Maddhiboyina |

రాజ్యసభలో నీట్ పరీక్షల వివాదం, పేపర్ లీకేజీలపై ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేపర్ లీక్ ఘటనకు బాధ్యతవహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.. రాజ్యసభలో ఖర్గే డిమాండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: రాజ్యసభలో నీట్ పరీక్షల వివాదం, పేపర్ లీకేజీలపై ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేపర్ లీక్ ఘటనకు బాధ్యతవహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపేర్ లీక్ నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చి వేలు, లక్షల మంది నిరసన చేస్తున్నారని చెప్పారు. ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం, వారు ఆస్పత్రి పాలవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ముందుగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆ తరవాత చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ నివాసం ముందు ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అక్కడ నుండి తరలించగా రాహుల్ గాంధీతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు రాహుల్ ప్రధానంగా మూడు డిమాండ్లను పెట్టారు. డిమాండ్లకు కేంద్రం ఓకే చెబితే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేశారు.

Next Story