- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుప్తనిధుల కోసం తవ్వకాలు..
by Kodari Anjali |
నార్కట్ పల్లి మండలం మాధవ ఏడవల్లి గ్రామ శివారులోని గుమ్మటాలపాడు దర్గా సమీపంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి తవ్వకాలు జరిపారు.

X
దిశ, నార్కట్ పల్లి: నార్కట్ పల్లి మండలం మాధవ ఏడవల్లి గ్రామ శివారులోని గుమ్మటాలపాడు దర్గా సమీపంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి తవ్వకాలు జరిపారు. ఆదివారం ఉదయం సమీప వ్యవసాయ పొలంలోని రైతులు గమనించారు. ఈ ప్రాంతంలో దర్గాతో పాటుగా పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని ఎప్పటినుంచే ప్రచారం జరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గతంలోనూ ఇక్కడ తవ్వకాలు జరిపారు. అదే క్రమంలో ప్రస్తుతం సైతం గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. అధికారులు, పోలీసులు దీనిపై విచారణ చేసి గుప్తనిధుల కోసం వేటాడుతున్న వ్యక్తులను గుర్తించాలని స్థానిక వ్యవసాయదారులు కోరుతున్నారు.
Next Story






