- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరు నెలలు విమర్శలే వద్దనుకున్నా.. రాష్ట్రపతి పాలన రాకూడదనే మద్దతు : స్టాలిన్
తమిళనాడులో ఇటీవల ఏర్పాటైన కొత్త ప్రభుత్వం.. మూడు నెలలైనా కొనసాగుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఇటీవల ఏర్పాటైన కొత్త ప్రభుత్వం.. మూడు నెలలైనా కొనసాగుతుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు సమయంలో.. ఆయన ఆరు నెలలపాటు విమర్శలు చేయబోనని, పాలనను పరిశీలిస్తామన్న మాటలను గుర్తుచేసుకున్నారు. కానీ నెలరోజులైనా గడవకుండా నూతన ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి.. తాము క్షేత్రస్థాయిలో 2026 ఎన్నికల కోసం చర్యలు చేపట్టామని తెలిపారు. కానీ కొందరు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించకపోయినా, ఓటర్లను నేరుగా కలవకపోయినా.. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. నాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఆపేందుకే తమ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో టీవీకేకు అనుమతించామని స్టాలిన్ తెలిపారు. అలా చేసి ఉండకపోతే.. రాష్ట్రంలో బీజేపీ పాలనకు మార్గం చాలా ఈజీగా దొరికేదన్నారు.






