నీట్ రీ-ఎగ్జామ్.. కీలక అప్డేట్ ఇచ్చిన NTA

by Naga Rani Yarlagadda |

నీట్ రీ ఎగ్జామ్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్డేట్ ఇచ్చింది.

నీట్ రీ-ఎగ్జామ్.. కీలక అప్డేట్ ఇచ్చిన NTA
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. నీట్ యూజీ -2026 రీ ఎగ్జామినేషన్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. అధికారిక వెబ్ సైట్లో తమ సిటీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఎన్‌టీఏ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన మేరకు జూన్ 21న రీ-ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. పేపర్ లీక్ ఘటనపై ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కొనసాగిస్తోంది.

సిటీ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం

అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.

హోమ్‌పేజీలో కనిపించే "Present Address and Exam City Updation Window for NEET (UG) 2026" లింక్‌పై క్లిక్ చేయాలి.

కొత్త పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా వివరాలు నమోదు చేయాలి.

అనంతరం ఎగ్జామ్ సిటీ స్లిప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

పెన్ అండ్ పేపర్ మోడ్‌లో పరీక్ష

ఎన్‌టీఏ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నీట్ యూజీ రీ-ఎగ్జామ్ జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతుంది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Next Story