- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధన్నారంలో సంపూర్ణ మద్యపాన నిషేధం
కాలనీలలో ఎక్కడ కూడా మద్యం అమ్మకాలు విక్రయించ వద్దని తీర్మానం చేసినట్లు కౌన్సిలర్ సుధాకర్ తెలిపారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి : కాలనీలలో ఎక్కడ కూడా మద్యం అమ్మకాలు విక్రయించ వద్దని తీర్మానం చేసినట్లు కౌన్సిలర్ సుధాకర్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు ధన్నారం గ్రామంలో గ్రామస్తులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం గుట్కా ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు కొనుగోళ్లు సేవించడం పూర్తిగా నిషేధిస్తున్నట్లు వారు పేర్పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మద్యం అమ్మే వారికి రూ. 5 లక్షలు కొనుగోలు చేసేవారికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తామని కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారన్నారు.
గ్రామస్తులంతా కలిసి మద్య నిషేధ అమలు కమిటీని ఏర్పాటు చేసి 24 గంటల నిఘాను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు. యువత భవిష్యత్తును కుటుంబాలను కాపాడుకునేందుకు తీసుకున్న ఈ నిర్ణయానికి ఎక్సైజ్ పోలీస్ శాఖలు సహకరించాలని గ్రామ పెద్దలు కోరారు. దాన్నారం గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మీమీ గ్రామాలలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీ గ్రామాలు బాగుపడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






