విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు

by Kodari Anjali |

తెలంగాణ సమాజంలో శ్రీకాంతాచారి జీవించే ఉన్నారు అని తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ అన్నారు.

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు
X

దిశ, నల్లగొండ క్రైం: విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని, సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ స్పష్టం చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియామకమైన ఆమెను విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు ఆమె హాజరైనారు. విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరణుడని తెలిపారు. తెలంగాణ సమాజం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను సైతం మరో వద్దన్నారు. తన కుమారుడు కాసోజు శ్రీకాంతాచారి తెలంగాణలో ప్రజల గుండెల్లో రాష్ట్ర సాధనలో జీవించే ఉన్నారని కన్నీటి పర్యంతమయ్యారు. విశ్వబ్రాహ్మణ జాతి అభ్యున్నతి కోసం ప్రభుత్వంతో కొట్లాడేనా కార్పొరేషన్ ఏర్పాటుకు దిశగా ముందుకు సాగుతుందన్నారు. తనను గౌరవించేలా అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సన్మానం చేయడం సంతోషంగా ఉంది..

అంతకుముందు సభ ప్రారంభంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఏర్పాటు సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. కమిషన్ సభ్యురాలు అ నియామకమైనటువంటి శంకరమను తెలంగాణలో ఇంతవరకు ఏ విశ్వబ్రాహ్మణ సంస్థ కూడా సత్కరించలేని రామే తొలి పర్యాయం సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి మాట్లాడుతూ సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ నిరుపేద విద్యార్థులకు చేయితనిస్తూ చదివిపిస్తున్నామని అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మణులు హక్కును చేర్చుకుని చూస్తున్నామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తమ పిల్లలతో తల్లిదండ్రులు హాజరై ఫొటోలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

సమావేశంలో పాల్గొన్నవారు..

అనంతరం వేదికపై వధూవరుల ఫొటోలను బయోడేటాలను ప్రదర్శిస్తూ వివరాలను తెలియజేశారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ వివాహ పరిచవేదిక కన్వీనర్ పర్వతం నరేంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ కోశాధికారి తరునోజు భీష్మాచార్య, మహిళ కార్యదర్శి పర్వతం శోభారాణి, విశ్రాంత అటవీశాఖ అధికారి ఎన్ వి రఘువీర్ ప్రతాప్, కంచనపల్లి షణ్ముఖ చారి, సేవా సంస్థ గౌరవాధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి, మాజీ గౌరవ అధ్యక్షులు కొండజు కృష్ణమాచారి, ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణ, దాసోజు బ్రహ్మచారి, కటకం వెంకటాచారి, కాసోజు శంకరాచారి, మనుమయ సంఘం పట్టణ మాజీ అధ్యక్షుడు సొల్లేటి రమేష్, చోల్లేటి కొండయ్య, రథం వెంకటరత్నం, పోలోజు శ్రీనివాస చారి, బౌరోజు రాఘవాచారి, సొల్లేటి వెంకటాచారి, ఉమారాణి, కూరెళ్ళ రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Next Story