- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TVS: టూ-వీలర్ మార్కెట్లో టీవీఎస్ మాస్టర్ ప్లాన్
లండన్ డిజైన్ ఏజెన్సీ రూపొందించిన ఈ మోడ్రన్ షోరూమ్‌ల ద్వారా కస్టమర్లకు కేవలం బైక్స్ అమ్మడమే కాకుండా, ఒక అద్భుతమైన బ్రాండ్ అనుభవాన్ని, ప్రత్యేక కమ్యూనిటీని సృష్టించనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన ప్రీమియం బైక్స్, స్కూటర్ల విభాగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. దేశంలో వేగంగా పెరుగుతున్న ప్రీమియం వాహనాల మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా, కేవలం హై-ఎండ్ బైక్స్ కోసం ‘టీవీఎస్ ప్యాడాక్’ పేరుతో ఒక సరికొత్త రిటైల్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. లండన్ డిజైన్ ఏజెన్సీ రూపొందించిన ఈ మోడ్రన్ షోరూమ్‌ల ద్వారా కస్టమర్లకు కేవలం బైక్స్ అమ్మడమే కాకుండా, ఒక అద్భుతమైన బ్రాండ్ అనుభవాన్ని, ప్రత్యేక కమ్యూనిటీని సృష్టించనున్నారు. ఈ సరికొత్త ప్రీమియం నెట్‌వర్క్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, ప్రీమియం స్కూటర్ల విభాగంలో యమహా ఏరోక్స్ 155 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు టీవీఎస్ ఒక సరికొత్త 160సీసీ మాక్సీ స్కూటర్‌ను సీక్రెట్‌గా డెవలప్ చేస్తున్నట్టు సమాచారం. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై, శక్తివంతమైన లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రూపొందుతున్న ఈ స్పోర్టీ స్కూటర్ 2027 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద 14-అంగుళాల టైర్లు, అడ్వాన్స్‌డ్ డిజిటల్ డిస్‌ప్లే, బ్లూటూత్ నావిగేషన్ వంటి ఫీచర్లతో రానున్న ఈ స్కూటర్, సరికొత్త 'ప్యాడాక్' షోరూమ్‌ల ద్వారా రాబోయే రోజుల్లో ప్రీమియం టూ-వీలర్ మార్కెట్లో టీవీఎస్ కీ-ప్లేయర్‌గా మారనుంది.






