- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొల్లపల్లి మండలంలో ఈదురు గాలుల బీభత్సం..!
మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

X
దిశ, గొల్లపల్లి : మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మండలంలోని తిరుమలపూర్ గ్రామంలో కళ్లెం రవి నివాసముంటున్న రేకుల షెడ్ ఈదురు గాలుల తీవ్రతకు పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసి పాడైపోయాయి. దీంతో రవి కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయులై, తలదాచుకునేందుకు నిలువు నీడ లేక రోడ్డున పడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇందిరమ్మ పథకం కింద పక్కా ఇళ్ళు మంజూరు చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబం సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Next Story






