రైతు పోరు సక్సెస్​తో మరో పోరుకు బీజేపీ ప్లాన్​

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో రేవంత్​రెడ్డి ప్రభుత్వంపై సమరం చేసేందుకు మహిళా, యువ మోర్చా, విద్యార్ధి విభాగాలకు స్పెషల్​ టాస్క్​ఇవ్వనున్నట్లు తెలిసింది.

రైతు పోరు సక్సెస్​తో మరో పోరుకు బీజేపీ ప్లాన్​
X
  • మహిళా, యువ, విద్యార్ధి విభాగాలకు ప్రత్యేక బాధ్యతలు
  • పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యక్రమాలపై సూచనలు
  • నేతల సమన్వయంపై అభయ్​ పాటిల్​ ఆగ్రహం
  • ఎవరికి వారే అన్నట్లు పోతే అధికారం ఎప్పటికి రాదని హితువు
  • పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు 12న రాజ్ నాథ్ సింగ్ రాష్ట్ర పర్యటన
  • ఈనెల 21న అన్ని పాఠశాలల వద్ద యోగా డే ఉత్సవాలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రేవంత్​రెడ్డి ప్రభుత్వంపై సమరం చేసేందుకు మహిళా, యువ మోర్చా, విద్యార్ధి విభాగాలకు స్పెషల్​ టాస్క్​ఇవ్వనున్నట్లు తెలిసింది. పార్టీ చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి వెళ్లేలా మీడియా ప్యానలిస్టులకు బాధ్యతలు అప్పగించింది. ఎవరి బాధ్యత వారు నిర్వహించడంలో ముందుకు పోవడం లేదని ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయా విభాగాలకు చెందిన నేతలను హెచ్చరించినట్లు తెలిసింది. తరువాత జరిగిన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌంటర్​ఇవ్వడంతో విఫమైతున్నారనే చర్చ జరిగింది. దీనిపై అభయపాటిల్ అదికార పార్టీతో రహస్య సమావేశాలు జరిపితే సహించేది లేదని హెచ్చరించారు. ఒక వైపు కాంగ్రెస్​వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తుంటే వారితో లోపాయి కారీ ఒప్పందాలు చేసుకుంటే ఊరుకునే ప్రస్తకి లేదన్నారు. ఇకా నుంచి హస్తిన పెద్దలు తెలంగాణ పార్టీ ఏవిధంగా ప్రజలకు వద్ద వెళ్లాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని దానిని ప్రతి ఒకరు అనుసరించాలని సూచనలు చేసినట్లు పార్టీ నేతలు చెప్పారు. అదే విధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు ప్లాన్​చేయాలని సూచినలు సమాచారం. ఆదివారం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో అధ్యక్షులు రాంచందర్​రావు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సమావేశం నిర్వహించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే గ్రేటర్, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. విద్యార్ధులకు ఫీజు రియంబర్స్​చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ఉత్తీర్ణత పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారు.

విద్యార్ధులతో కలిసి మరో వైపు ఉద్యమించేందుకు విద్యార్ధి విభాగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఈనెల 12వ తేదీన కేంద్ర మంత్రి రాజ్​సింగ్​రాష్ట్ర పర్యటన చేపట్టనున్నారు. పార్టీ పరిస్ధితి, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై ఆయన దిశ నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఉనికి సక్రమంగా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధిస్తుంటే పార్టీ ప్రారంభంలో రెండు ఎంపీ సీట్లు గెలిస్తే అందులో తెలంగాణ నుంచి ఒకరు గెలిచిన సందర్భాలున్న ఎందుకు వెనకబడిందని హైకమాండ్​సమాలోచనలు చేస్తోంది. పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని, రాష్ట్రానికి చెందిన నాయకులే సమన్వయం లేకపోవడంతో ప్రతిసారి ఓటములు చవిచూడాల్సి వస్తోంది. ఒక ఎంపీ ఎన్నికల్లో తప్ప ఎప్పడు ఎన్నికలు జరిగిన బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. లోపమంతా ఇక్కడి నాయకులదేనని గ్రహించిన హస్తిన పెద్దలు పార్టీ ప్రక్షాళన చేసేందుకు సిద్దమైనట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందులో బాగంగా ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక సమస్యలపై పోరు బాటకు నడుం బిగించినట్లు తెలుస్తోంది. ఇటీవల ధాన్యం కొనుగోలపై పర్యటన చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసింది. దీంతో రైతుల నుంచి బీజేపీ నేతలు ప్రశంసలు పొందారు. నిజంగా పార్టీ కోసం నాయకులు శ్రమిస్తే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ను కనుమరుగు చేయవచ్చని పార్టీ పెద్దలు అంచనాకు వచ్చారు. ఏవిధంగానైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే సక్సెస్​అవుతామని రాష్ట్ర పార్టీ నేతలు భావిస్తున్నారు. త్వరలో జిల్లాల కమిటీలతో సమావేశం నిర్వహించి ఏ కార్యక్రమాలపై పోరు చేయాలని ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు బీజెఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి వెల్లడించారు.

ఈనెల 21 నుంచి పాఠశాల వద్ద యోగా : కిషన్​రెడ్డి

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలని.. సమాజాన్ని చైతన్యం చేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. 20వ తేదీన ఎల్బీస్టేడియంలో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. 21వ తేదీన ఆయా పాఠశాలల వద్ద విద్యార్థులతో కలసి యోగా చేయాలని పిలుపునిచ్చారు. 24వ తేదీన అవర్స్ యోగా డే కౌంట్‌డౌన్‌‌గా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో యోగా గురించి ప్రతిపాదన చేశారని ప్రస్తావించారు. 170 దేశాలు ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేశాయని వెల్లడించారు. 225 దేశాలు యోగాడేను అధికారికంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.

Next Story