రాజధాని విషయంలో జగన్ ప్రజలను తికమకపెట్టాలని చూస్తున్నాడు: మంత్రి గొట్టిపాటి

by Ajay Maddhiboyina |

రాజధాని విషయంలో జగన్ ప్రజలను తికమకపెట్టాలని చూస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జ‌గ‌న్ ఒక్క‌సారైనా అమ‌రావ‌తి అభివృద్ధిని క‌ళ్ల‌తో చూడాల‌ని చెప్పారు.

రాజధాని విషయంలో జగన్ ప్రజలను తికమకపెట్టాలని చూస్తున్నాడు: మంత్రి గొట్టిపాటి
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని విషయంలో జగన్ ప్రజలను తికమకపెట్టాలని చూస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జ‌గ‌న్ ఒక్క‌సారైనా అమ‌రావ‌తి అభివృద్ధిని క‌ళ్ల‌తో చూడాల‌ని చెప్పారు. అమ‌రావ‌తి ఎడ్యుకేష‌న్ హ‌బ్ గా మారుతుంద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఇక్క‌డ‌కు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ యూనివ‌ర్సిటీ, కాలేజీలు రాబోతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాల వ‌ల్ల‌నే పెద్దఎత్తున నిర్మాణాలు జ‌రిగాయ‌ని తెలిపారు. అమ‌రావ‌తిలో నిర్మాణాలు చాలా గొప్పగా ఉన్నాయ‌ని, అద్భుత నివాస‌యోగ్య‌మైన న‌గ‌రం త‌యార‌వుతోంద‌ని అన్నారు. ఐకానిక్ భ‌వ‌నాల మొద‌టి డైమండ్ పూర్తైంద‌ని చెప్పారు. డిసెంబ‌ర్ నాటికి 12 ఫ్లోర్లు సిద్ధం అవుతాయ‌ని, త్వ‌ర‌లోనే అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్ట్ కూడా వ‌స్తుంద‌ని తెలిపారు. ఇదిలా ఉంటే అమ‌రావ‌తి నిర్మాణంపై ఏపీ ప్ర‌భుత్వం పూర్తి దృష్టి పెట్టింది. రాజ‌ధాని నిర్మాణం కోసం పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తూ శ‌ర‌వేగంగా ప‌నులు పూర్తి చేస్తోంది. ఇప్ప‌టికే దిగ్గ‌జ కంపెనీలు అమ‌రావ‌తిలో నిర్మించేందుకు ఒప్పందం చేసుకోగా కొన్ని కార్యాల‌యాల నిర్మాణం సైతం ప్రారంభ‌మైంది.

Next Story