రవీంద్రసూరికి సినారె సాహితీ పురస్కారం

by Ajay Maddhiboyina |

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కవి, సినీ దర్శకుడు నామాల రవీంద్రసూరికి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక డా. సి. నారాయణరెడ్డి (సినారె) స్మారక సాహితీ పురస్కారం ప్రకటించారు.

రవీంద్రసూరికి సినారె సాహితీ పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కవి, సినీ దర్శకుడు నామాల రవీంద్రసూరికి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక డా. సి. నారాయణరెడ్డి (సినారె) స్మారక సాహితీ పురస్కారం ప్రకటించారు. మహాకవి సినారె 95వ జయంతిని పురస్కరించుకొని సినారె కళాపీఠం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాల్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేసిన ఎంపిక కమిటీ సభ్యులకు, సినారె కళాపీఠం అధ్యక్షులు మల్లెకేడి రాములుకు రవీంద్రసూరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా సాహిత్యానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story