- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు’.. అసెంబ్లీ చిట్‌చాట్‌లో సీఎం ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్‌లో ఓట్ల సవరణ, ఓటర్ జాబితాల ప్రక్షాళన (SIR) ప్రక్రియతో పాటు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభలో జరుగుతున్న పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్‌లో ఓట్ల సవరణ, ఓటర్ జాబితాల ప్రక్షాళన (SIR) ప్రక్రియతో పాటు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘నాకు ఎక్కడైనా రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలు ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. నేను నా ఓటును నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకున్నాను. గతంలో కొడంగల్, గద్వాల, అలంపూర్ వంటి ప్రాంతాలు కర్ణాటక పరిధిలో ఉండేవి. చరిత్ర తెలియకుండా, బలిసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తండావాసుల ఓట్లను కాపాడే బాధ్యత కార్యకర్తలదే..
రాష్ట్రంలో తండాల్లో నివసించే గిరిజన ప్రజలు జీవనోపాధి. వృత్తి రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని, కేవలం ఓటింగ్ సమయంలోనే తమ స్వగ్రామాలకు వస్తుంటారని సీఎం తెలిపారు. అటువంటి పేద ప్రజల ఓట్లు జాబితా నుంచి గల్లంతు కాకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకుని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతి ఇల్లు ఎక్కడుంది? ఓటర్లు ఎక్కడ నివసిస్తున్నారు? అనే స్పష్టమైన సమాచారం బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) మాత్రమే సరిగ్గా తెలుస్తుందని చెప్పారు.
తొలగింపు కాదు.. ప్రక్షాళన పైనే దృష్టి పెట్టాలి..
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో నిజమైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియ జరగకూడదని, అసలైన ప్రక్షాళన ప్రక్రియపైనే అధికారులు, యంత్రాంగం దృష్టి సారించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 శాతం సర్వే పూర్తయిందని, ఇంకా 30 శాతం సవరణ జరగాల్సి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు పూనుకుంటేనే ఓటర్ల హక్కుల పరిరక్షణతో పాటు ఏ పనైనా విజయవంతంగా పూర్తవుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






