- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీలో ఆ లక్షణాలా..? విటమిన్ B12 లోపం కావచ్చు!
విటమిన్ బి12 శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. దీనిని ఆహారం ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది.

దిశ, ఫీచర్స్ : విషయాలు పదే పదే మర్చిపోతున్నారా? ఎప్పుడూ గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తున్నదా? అయితే అది విటమిన్ B12 లోపం కూడా కావచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. మెమరీ సమస్యలు, చేతులు, కాళ్లల్లో తిమ్మిరి, అలసట, బలహీనత వంటివి దీనికారణంగానే ఎక్కువగా తలెత్తుతుంటాయి. ముఖ్యంగా నడీడు వయసు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకలా జరుగుతుంది?
నిజానికి విటమిన్ బి12 శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. ఇది ఆహారం ద్వారా మాత్రమే లభిస్తుంది. అయితే దీని లోపం ఏర్పడటానికి గల ప్రధాన కారణాలో వయసు పెరగడం, ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కడుపు ఆమ్లం, ఇంట్రిన్సిక్ ఫాక్టర్ తగ్గడం వల్ల శరీరం బి12ని గ్రహించడం కష్టమవుతుంది. అలాగే మెట్‌ఫార్మిన్ (డయాబెటిస్), ఆమ్లత నివారణ మందులు (Omeprazole, Pantoprazole వంటివి) దీర్ఘకాలంపాటు వాడేవారిలోనూ దీని లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మాంసాహారం తక్కువ తినడం లేదా వేగన్/స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ అలవాట్ల వల్ల కూడా విటమిన్ 12 లోపం ఏర్పడవచ్చు. ఇతర కారణాల విషయానికి వస్తే కడుపు లేదా ప్రేగుల శస్త్రచికిత్స, క్రానిక్ గట్ సమస్యలు, పెర్నిషియస్ అనీమియా వంటి కారణలతోనూ లోపం ఏర్పడుతుంది.
ముఖ్య లక్షణాలు
*మెమరీ సమస్యలు, గందరగోళం, బ్రెయిన్ ఫాగ్ (డెమెన్షియా లాగా)
*చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు
*దీర్ఘకాలిక అలసట, బలహీనత
*నడవడంలో సమస్య, సమతుల్యం కోల్పోవడం
*నాలుక నొప్పి, ఎర్రబడడం లేదా మెత్తబారడం
*డిప్రెషన్, చిరాకు, మూడ్ మార్పులు
*పాలిపోయిన చర్మం, శ్వాస ఆడకపోవడం
నివారణ & చికిత్స ఏమిటి?
గుడ్లు, పాలు, సాల్మన్ చేప, పనీర్, పెరుగు, సార్డైన్స్, మాంసాహారంలోని లివర్, గొడ్డు మాంసం (Beef) వంటివి విటమిన్ బి12 లోపాన్ని నివారించడంలో సహాయపడే అద్భుతమైన ఆహారాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. లక్షణాలను కనిపించినా లేదా మీలో విటమిన్ బి12 లోపం ఉందనే అనుమానం కలిగితే వైద్య నిపుణులను సంప్రదించి నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ లోపం ఉంటే డాక్టర్ సూచించిన ప్రకారం మెడిసిన్ వాడటం, ఆహారాలు తీసుకోవడం వంటివి చేయాలి.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






