- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు..
సర్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు చేయడం జరిగిందని మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్ గురువారం తెలిపారు.

దిశ, మణుగూరు: సర్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు చేయడం జరిగిందని మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్ గురువారం తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రెవిజన్(సర్ )కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కూడా మణుగూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ పరిధిలో ప్రత్యేక (స్పెషల్) క్యాంపులు నిర్వహించ బడుతున్నాయన్నారు. ఈ ప్రత్యేక శిబిరాలు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించబడతాయన్నారు. రాజీవ్ గాంధీ నగర్ ఏరియా పరిధిలోని ఓటర్ల కోసం మార్కెట్ యార్డ్ వద్ద, అలాగే పీవీ కాలనీ, కూనవరం ఏరియా పరిధిలోని ఓటర్ల కోసం సీ ఈ ఆర్ సింగరేణి క్లబ్ వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. మండలంలోని అర్హులైన ఓటర్లందరూ సంబంధిత పత్రాలతో ప్రత్యేక శిబిరాలకు హాజరై ఎన్యూమరేషన్, ఆన్ లైన్ ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయించుకొని, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.






