- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెజాన్, ఉబర్ లలో లేఆఫ్స్.. ఏఐతోనే అంతా!
ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ (Amazon) మరోసారి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ (Amazon) మరోసారి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టింది. ఈసారి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ టెక్నాలజీ అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు వస్తున్నప్పటికీ.. నిర్వహణ మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొద్ది నెలల క్రితమే సంస్థలో దాదాపు 16,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించిన అమెజాన్.. ఇప్పుడు మరోసారి పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. అయితే.. ఈ విడతలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. కస్టమర్లకు అత్యధిక విలువ అందించే ప్రాజెక్టులపై వనరులను కేంద్రీకరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెజాన్ తెలిపింది. తాజా కోతలు ప్రధానంగా తదుపరి తరం కృత్రిమ మేధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్న ఏజీఐ (AGI) విభాగంలోని బృందాలపై ప్రభావం చూపనున్నాయి.
నెక్స్ట్-జనరేషన్ ఏఐ సిస్టమ్‌లను అభివృద్ధి చేసే AGI విభాగంలోని బృందాలపైనే ఈ ప్రభావం పడుతుందని రాయిటర్స్ నివేదించింది. సిబ్బందిని తగ్గించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది తమ దీర్ఘకాలిక ప్రాధాన్యతలలో ఒకటిగా కొనసాగుతుందని అమెజాన్ స్పష్టం చేసింది. ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ అయిన ఉబర్ టెక్నాలజీస్ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సేవలను మరింత సులభతరం చేయడం, సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా లేఆఫ్స్ చేపడుతున్నట్లు పేర్కొంది. తొలగించిన ఉద్యోగుల స్థానంలో ఏఐ నే కస్టమర్లతో సంప్రదిస్తుందని, జనరేటివ్ ఏఐ ద్వారా ఈ పనిచేయనున్నట్లు స్పష్టం చేసింది.






