రెండుసార్లు సర్పంచ్‌గా సేవలు... నేడు వైద్యం కోసం ఇతరుల సాయమే దిక్కు

by Ratna Kumari |

ఒకప్పుడు గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధిగా సేవలందించిన వ్యక్తి, నేడు తీవ్ర అనారోగ్యంతో వైద్య చికిత్స కోసం ఇతరుల సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండుసార్లు సర్పంచ్‌గా సేవలు... నేడు వైద్యం కోసం ఇతరుల సాయమే దిక్కు
X

దిశ, కొడిమ్యాల : ఒకప్పుడు గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధిగా సేవలందించిన వ్యక్తి, నేడు తీవ్ర అనారోగ్యంతో వైద్య చికిత్స కోసం ఇతరుల సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెట్టుపల్లి హరేందర్ రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చులు భారంగా మారడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు ముందుకు వచ్చి రూ.52 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆ మొత్తాన్ని హరేందర్ భార్యకు అందించి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఎన్నో సంవత్సరాలు గడిపిన మాజీ ప్రజాప్రతినిధి నేడు వైద్యం కోసం ఇతరుల దాతృత్వంపై ఆధారపడాల్సి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజలకు సేవ చేసిన వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, నాయకులు కృష్ణారావు, వెంకటేష్, నరేందర్ రెడ్డి, మల్లేశం, మహేష్, సత్యం, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story