- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ ఏరినా సంస్థతో నాకు సంబంధం లేదు
గ్లోబల్ ఏరినా సంస్థ తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్) లీగల్ నోటీసు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

దిశ వరంగల్ బ్యూరో : గ్లోబల్ ఏరినా సంస్థ తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం (డిఫమేషన్) లీగల్ నోటీసు పంపినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా మాడికొండలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. గ్లోబల్ ఏరినా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ సంస్థ నిజంగానే తన బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకవైపు ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, మరోవైపు అది తన బినామీ సంస్థ అని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదని విమర్శించారు. రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో ఉంటారని ఆరోపించారు. "కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నది రేవంత్ రెడ్డి పాలన" అని విమర్శించారు. తాను సీఐడీ విచారణకు సిద్ధమని, అలాగే రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి ఆరోపణలపై సిట్ లేదా సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి సిద్ధమేనా అని ప్రశ్నించారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమేనని, ముఖ్యమంత్రి కూడా అందుకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పాత కేసుల భయం, అమృత్ పథకం తదితర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గ్లోబల్ ఏరినా సంస్థపై ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్న కేటీఆర్, ఆ ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పరువు నష్టం నోటీసు పంపినట్లు తెలిపారు.






