- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్ష నేతలపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, వేధింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.

దిశ, ఘట్కేసర్ : ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు, వేధింపులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఘట్కేసర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివారెడ్డిగూడ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గొంతును అణచివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, ముత్యాలు యాదవ్, బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్, అనిత, ముల్లి పావని, మాధవరెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






