జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. నోటీసులు జారీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-23 09:59:43  IST  )

వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. కర్నూలు నిర్వహించిన ధర్నాలో ఆయన స్థానిక సీఐ శేషయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సీఐను అవమానించారంటూ జక్కంపూడిపై కేసు నమోదు చేశారు. ...

జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. కర్నూలు ధర్నాలో స్థానిక సీఐ శేషయ్యపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సీఐను అవమానించారంటూ జక్కంపూడిపై తాజాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ టికెట్ కోసం శేషయ్య తమ వద్దకు వచ్చారని జక్కంపూడి తెలిపారు. అంతేకాదు కోట్ల సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నం చేశారని, అయితే తాము అవినీతిపరులకు టికెట్లు ఇచ్చేది లేదని గెంటేశామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్త బాలుని సీఐ వేధించారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి ముందు గేటు వద్ద ఎండకి, వానకి నిలబడేలా చేస్తామని జక్కంపూడి హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఎస్సీ కమిషన్‌ను సీఐ శేషయ్య ఆశ్రయించారు. జక్కంపూడి చేసిన వ్యాఖ్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. జక్కంపూడి వ్యాఖ్యలను పరిశీలించిన కమిషన్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు జక్కంపూడి రాజాపై కర్నూలు త్రీటౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

Next Story