- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరసనలో పాల్గొంటే డ్రగ్స్ కేసులు పెడతాం.. విద్యార్థులకు పోలీసుల బెదిరింపులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రిపగలు తేడా లేకుండా విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద తమ నినాదాలు వినిపిస్తూ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రిపగలు తేడా లేకుండా విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద తమ నినాదాలు వినిపిస్తూ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల నిరసనను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులపై మొన్న లాఠీ ఛార్జ్ చేస్తూ, భాష్పవాయువు సైతం ప్రయోగించారు. దీంతో లాఠీ చార్జ్ కు వ్యతిరేకంగా నీట్ విద్యార్థులకు మద్దతిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే ముంబైలో నీట్ విద్యార్థులకు మద్దతు ఇస్తూ ఆందోళనలు చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకోగా ఓ పోలీస్ అధికారి విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులను జీపులో ఎక్కించుకున్న అధికారి మరోసారి నిరసనలో కనిపిస్తే చేతిలో డ్రగ్స్ పెట్టి, కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.దీనిని విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.






